Khushbu: గోమూత్రం, ఆవుపేడ అంటూ చెత్త ప్రచారం చేస్తున్నారు: ఖుష్బూ

Khusbhu tells do not campaign that cow urine cures corona
  • గోమూత్రంతో కరోనా పారిపోతుందంటూ ప్రచారం
  • ప్రజల ఆరోగ్యాలను ప్రమాదంలోకి నెట్టవద్దంటూ ఖుష్బూ హితవు
  • గుడ్డివాళ్లు ఇకనైనా మేల్కొంటారా? అంటూ ట్వీట్
కరోనా వైరస్ ను ఇలా కూడా నివారించవచ్చంటూ జరుగుతున్న కొన్ని ప్రచారాలపై సినీ నటి, తమిళనాడు కాంగ్రెస్ మహిళా నేత ఖుష్బూ ఘాటుగా స్పందించారు. గోమూత్రం ప్రతి వ్యాధిని నయం చేస్తుందని చెత్త ప్రచారం చేస్తున్నారని, తద్వారా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.

ఆరోగ్యం విషయంలో కాషాయం, మతం వంటి అంశాలకు తావు ఉండరాదని, నిరక్షరాస్యులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించొద్దని హితవు పలికారు. గోమూత్రం, ఆవుపేడతో కరోనా వైరస్ ఆమడదూరం అంటూ జరుగుతున్న ప్రచారంపై ఖుష్బూ ఈ వ్యాఖ్యలు చేశారు. గుడ్డివాళ్లు ఇకనైనా మేల్కొంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Khushbu
Cow Urine
Cow Dung
Corona Virus

More Telugu News