Ranga Reddy District: రంగారెడ్డి జిల్లాలో బాంబు కలకలం... పేలుడుతో ఉలిక్కిపడిన స్థానికులు!

bomb blast in rangareddy district near sivarmpalli railway station
షార్ట్స్‌లో చూడండి
రంగారెడ్డి జిల్లాలో బాంబు పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాసేపు ఆందోళనకు కారణమయ్యింది. జిల్లాలోని శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈరోజు ఉదయం భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటన కారణంగా సమీపంలోని ఇళ్ల కిటికీల అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి.

ఊహించని ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడమేకాక భయాందోళనలకు కారణమైంది. ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఓ కెమికల్‌ డబ్బా కారణంగానే ఈ పేలుడు జరిగి ఉండవచ్చునని ప్రాథమికంగా నిర్థారించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Go Back to Shorts
Ranga Reddy District
bomb blast
sivarampalli
railway station

More Telugu News