kolliwood: సినిమా అవకాశం కావాలంటే ఆ నిర్మాత తన వద్దకు రమ్మన్నాడు: తమిళ నటి రాణి బోజన్‌

  • తాను ఎదుర్కొన్న అనుభవాలను బయటపెట్టిన నటి 
  • ఓ నిర్మాత  పడక గదికి రమ్మన్నాడు 
  • అలాంటి అవకాశం నాకు వద్దని చెప్పాను 
rani bojan faces casting couch

తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్‌ కౌచ్‌పై హీరోయిన్లు ధైర్యంగా నోరువిప్పుతున్నారు. ఈ జాబితాలో మరో నటి చేరింది. ఓ ఇంటర్వ్యూలో తమిళ నటి వాణిబోజన్‌ మాట్లాడుతూ బుల్లి తెర నుంచి సినీ పరిశ్రమకు పరిచయమైన నేపథ్యంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను బయటపెట్టింది.

తాను కూడా సినీ పరిశ్రమలో అలాంటి అనుభవాలు ఎదుర్కొన్నానని ఆమె చెప్పింది. సినిమా అవకాశం కావాలంటే ఓ నిర్మాత తనను పడక గదికి రమ్మన్నాడని తెలిపింది. దీంతో తాను అలాంటి అవకాశం తనకు వద్దని చెప్పినట్లు పేర్కొంది. దీంతో కోలీవుడ్‌లో ఈ అంశం చర్చనీయాంశం అవుతోంది. ఆమె నటించిన తొలి సినిమా 'ఓ మై కడవులే' సూపర్‌హిట్‌ అయింది. ప్రస్తుతం పలు సినిమాల్లో ఆమె నటిస్తోంది.

More Telugu News