'ఆచార్య' సినిమాలో హీరోయిన్ గా కాజల్?
- షూటింగు దశలో 'ఆచార్య'
- ప్రాజెక్టు నుంచి తప్పుకున్న త్రిష
- మరో సారి చిరూ జోడీగా కాజల్
తీరా షూటింగ్ దగ్గర పడుతుండగా ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యపోయేలా చేసింది. 'స్టాలిన్' తరువాత ఈ జంటను తెరపై చూడాలనుకున్నవారు నిరాశ చెందారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆమెతో సంప్రదింపులు పూర్తయ్యాయని అంటున్నారు. తదుపరి షెడ్యూల్ షూటింగుకి కాజల్ హాజరు కానుందని చెబుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఖైదీ నెంబర్ 150' ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.