అనుష్కను రవితేజ, ఛార్మి, నేనూ ‘అమ్మా’ అని పిలుస్తాం: దర్శకుడు పూరీ జగన్నాథ్
- అనుష్క సినీ రంగంలోకి ప్రవేశించి పదిహేనేళ్లు
- మంచితనం, తెలివితేటలు.. అన్నీ కలిసిన కాంబినేషన్ అనుష్క
- ఆమెను కలిసినప్పుడల్లా ఆమె కాళ్లకు దండం పెడతామన్న పూరీ
‘రవితేజ, ఛార్మి, నేను.. అనుష్కను ‘అమ్మ’ అని పిలుస్తామని, ఆమెను కలిసినప్పుడల్లా ఆమె కాళ్లకు దండం పెట్టి ‘బ్లెస్సింగ్స్’ తీసుకుంటామని, ఎందుకంటే, ఆమెలో ఉన్న మంచి లక్షణాలలో కొన్నైనా తమకు రావాలని ఆ విధంగా చేస్తామని చెప్పారు. ‘చాలా మంచితనం, చాలా తెలివితేటలు.. అన్నీ కలిసిన ఓ కాంబినేషన్‘ అంటూ అనుష్కను ప్రశంసించారు.