చంద్రబాబు ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు: బోండా ఉమ
- మమ్మల్ని చంపేందుకు నిన్న మూడు సార్లు ప్రయత్నించారు
- తాడేపల్లి కార్యాలయం నుంచే హత్యాయత్నానికి స్కెచ్ వేశారు
- మాకు ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాలి
మాచర్లకు తాము వెళ్తున్న సమాచారాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లికి పోలీసులే ఇచ్చారని ఉమ ఆరోపించారు. తమకు పోలీసులపై నమ్మకం పోయిందని చెప్పారు. తమకు ఏం జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని అన్నారు. గన్ మెన్లతో తమకు భద్రత కల్పించాలని కోరారు.