Nirbhaya: జైల్లో విపరీతంగా కొడుతున్నారట... నిర్భయ దోషి పవన్ గుప్తా మరో పిటిషన్!

Nirbhaya Convict another Petition in Court
  • అధికారులు దారుణంగా హింసిస్తున్నారు
  • పటియాలా కోర్టుకు ఫిర్యాదు
  • నేడు జరుగనున్న విచారణ
తనను తీహార్ జైలులో దారుణంగా హింసిస్తున్నారని, జైలు అధికారులు నిత్యమూ కొడుతూ ఉన్నారని ఆరోపిస్తూ, నిర్భయ కేసులో దోషి పవన్ గుప్తా పటియాలా హౌస్ కోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేశాడు. పవన్ తరఫున న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేయగా, నేడు విచారణ జరుగనుంది. నిర్భయ కేసులో నలుగురు దోషులకూ 20న శిక్షను అమలు చేయాలని తాజాగా డెత్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే.

అయితే, తమకు విధించబడిన ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు, ఇప్పటికే అన్ని రకాల న్యాయపరమైన అవకాశాలనూ వినియోగించుకున్నారు. ఆపై కొత్త పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇందులో భాగంగా, నిన్న ఓ దోషి, తన కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శిక్ష తగ్గించాలని వేడుకుంటూ, పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరగాల్సివుంది. తాజాగా మరో దోషి శిక్షను తప్పించుకునేందుకు ఇంకో పిటిషన్ వేయడం గమనార్హం.
Nirbhaya
Pavan Gupta
Patiyala House Court
Death Warrent
Tihar

More Telugu News