Del India: పూణె లోని డెల్, మైండ్ ట్రీ ఉద్యోగులకు కరోనా పాజిటివ్

Dell and Mind Tree Employees tested corona virus positive
  • విదేశాల నుంచి వచ్చిన ఉద్యోగులు
  • అత్యుత్తమ వైద్య సదుపాయం అందిస్తున్న సంస్థలు
  • పూణె కార్యాలయంలోని ఓ అంతస్తును మూసేసిన యాక్సెంచర్
తమ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్టు ప్రముఖ ఐటీ సంస్థలు డెల్ ఇండియా, మైండ్‌ట్రీ కంపెనీలు ప్రకటించాయి. వీరిని క్వారెంటైన్ చేసి, అత్యుత్తమ వైద్య సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపాయి. డెల్ ఉద్యోగి అమెరికాలోని టెక్సాస్ నుంచి రాగా, మైండ్ ట్రీ ఉద్యోగి కూడా విదేశాలకు వెళ్లి వచ్చారు. దీంతో వీరికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో రిపోర్టులు పాజిటివ్ వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన కంపెనీలు వారికి అత్యుత్తమ వైద్య సాయం అందిస్తున్నాయి. కాగా, యాక్సెంచర్ సంస్థ పూణె కార్యాయలంలోని ఒక అంతస్తును తాత్కాలికంగా మూసివేసింది.
Del India
Mind Tree
Corona Virus
accenture

More Telugu News