Andhra Pradesh: ఏపీలో ఆపరేషన్ 'సురా'... 700 మందికిపైగా అరెస్ట్!

Operation SURA in Andhrapradesh
  • సంపూర్ణ మద్య నిషేధం దిశగా ఏపీ
  • డీజీపీ నుంచి స్పష్టమైన ఆదేశాలు
  • 759 ప్రాంతాల్లో దాడులు చేసిన 10 వేల మంది సిబ్బంది  
దశలవారీగా రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్డినెన్స్ కు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ 'సురా' జరుగుతోంది. డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలతో వివిధ జిల్లాల్లోని సారా తయారీ కేంద్రాలపై డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌ లాల్‌ పర్యవేక్షణలో దాడులు జరిగాయి.

ఒకేసారి దాదాపు 10 వేల మంది సిబ్బంది 759 ప్రాంతాల్లో ఈ దాడుల్లో పాల్గొన్నారు. దాడుల్లో 4627 లీటర్ల సారాను, సుమారు 2312 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, అనుమతిలేని 24 వాహనాలను సీజ్ చేశామని, 702 మందిని అరెస్టు చేసి, మొత్తం 683 కేసులు నమోదు చేశామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
Andhra Pradesh
Operation Sura
Liquor
Police
Raids

More Telugu News