కరోనా ఎఫెక్ట్ నుంచి బయటపడేందుకు రూ.3 లక్షల కోట్లు.. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన బ్రిటన్
- వివరాలు వెల్లడించిన బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్
- ఆర్థిక వ్యవస్థకు ఊపు ఇచ్చేందుకు వడ్డీ రేట్ల తగ్గింపు
- త్వరలో అంతా సర్దుకుంటుందని భావిస్తున్నట్టు వెల్లడి
కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏకంగా రూ.3 లక్షల కోట్ల (3,900 కోట్ల డాలర్ల)తో ఉద్దీపన ప్యాకేజీని బ్రిటన్ ప్రకటించింది. ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థకు ఊపు ఇచ్చేందుకు, ప్రజల వినియోగం, వ్యయాలను పెంచేందుకు వడ్డీ రేట్లను తగ్గించింది. దీనికి సంబంధించి బ్రిటన్ ఆర్థిక మంత్రి, ఆ దేశ ప్రధాన బ్యాంకు ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ ప్రతినిధులు బుధవారం వేర్వేరుగా వివరాలను ప్రకటించారు.