Panchumarthi Anuradha: మాచర్ల అరాచకాన్ని కప్పిపుచ్చుకునేందుకే హోంమంత్రి మీడియా ముందుకు వచ్చారు: పంచుమర్తి అనురాధ

Panchumarthi Anuradha slams YSRCP leaders over Macherla row
  • మాచర్లలో బోండా ఉమ, బుద్ధాలపై దాడి
  • హోంశాఖపై జగన్, ఇతరులు పెత్తనం చేస్తున్నారన్న పంచుమర్తి
  • తప్పు చేశారు కాబట్టే అనుకూల మీడియా సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపణ
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని టీడీపీ వర్గాలు తీవ్రంగా ఖండిస్తూ అధికార పార్టీపై మండిపడుతున్నాయి. ఈ క్రమంలో దీనిపై ఆ పార్టీ మహిళా నేత పంచుమర్తి అనురాధ స్పందించారు.

మహిళా రైతులు రాజధానిలో 85 రోజులుగా ఆందోళన చేస్తున్నా వారి గోడు వినలేదు కానీ, మాచర్ల అరాచకాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాత్రం హోంమంత్రి వచ్చారని ఆరోపించారు. హోంశాఖపై జగన్, ఇతరులే పెత్తనం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ యువజన నేత హత్యాయత్నానికి పాల్పడితే సీఎం నోరు విప్పలేదని అన్నారు. తప్పు చేశారు కాబట్టే హోంమంత్రితో అనుకూల మీడియా సమావేశం ఏర్పాటు చేయించారని అనురాధ మండిపడ్డారు.
Panchumarthi Anuradha
Macherla
Mekathoti Sucharitha
Jagan
YSRCP
Bonda Uma
Budda Venkanna

More Telugu News