Varla Ramaiah: రాష్ట్రానికి అసలు హోంమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి: వర్ల రామయ్య సెటైర్

Varla Ramaiah fires on YSRCP leaders over Macherla issue
  • ఓ మహిళ హోంమంత్రిగా అబద్ధాలు ఆడడం తగదన్న వర్ల
  • డీజీపీ కార్యాలయం వద్ద చంద్రబాబును అడ్డుకున్నారని వెల్లడి
  • చంద్రబాబును పోలీసులు లోపలికి పిలిచారన్నది అవాస్తవం అని వ్యాఖ్యలు
సీనియర్ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన దాడిని టీడీపీ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి అసలు హోంమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆరోపించారు.

మహిళా హోంమంత్రిగా సుచరిత అబద్ధాలు ఆడడం తగదని హితవు పలికారు. చంద్రబాబు డీజీపీ కార్యాలయానికి వెళితే గేటు మూసేసి పోలీసులు నిరోధించారని మండిపడ్డారు. చివరికి శాంతిభద్రతల డీజీ వచ్చి ఫిర్యాదు తీసుకున్నారని తెలిపారు. చంద్రబాబును పోలీసులు లోపలికి పిలిచారన్నది అవాస్తవం అని స్పష్టం చేశారు.
Varla Ramaiah
Sajjala
Home Minister
Andhra Pradesh
Mekathoti Sucharitha
Chandrababu
Police
DGP
Telugudesam
YSRCP

More Telugu News