Vishwak Sen: 'దిల్' రాజు నిర్మాణంలో విష్వక్సేన్ మూవీ

Dil Raju Movie
షార్ట్స్‌లో చూడండి
విష్వక్సేన్ నటుడిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వస్తున్నాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'హిట్' చిత్రం, నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. పోలీస్ ఆఫీసర్ తరహా పాత్రలను సైతం ఆయన చక్కగా పోషించగలడని నిరూపించింది. ఆ తరువాత ఆయన 'దిల్' రాజు బ్యానర్లో చేయనుండటం విశేషం. నరేశ్ కొప్పల్లి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

నరేశ్ వినిపించిన కథ కొత్తగా .. ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో, ఈ సినిమా చేయడానికి 'దిల్' రాజు అంగీకరించాడని అంటున్నారు. ఈ సినిమాకి సహనిర్మాతగా బెక్కం వేణుగోపాల్ వ్యవహరించనున్నాడు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగును కూడా ఆరంభిస్తారట. త్వరలోనే హీరోయిన్ .. ప్రతినాయకుడు వంటి వివరాలతో పాటు మిగతా వివరాలను వెల్లడించనున్నారు.
Go Back to Shorts
Vishwak Sen
Naresh Koppalli
Dil Raju Movie

More Telugu News