ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం.. వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐకి అప్పగింత
- సాధ్యమైనంత త్వరగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలి
- కేసు దర్యాప్తులో సమయం చాలా కీలకం
- అందుకే, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నాం
కాగా, 2019 మార్చి 15 వైఎస్ వివేకా హత్య జరిగింది. ఈ కేసును ఛేదించేందుకు మూడుసార్లు సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినా, ఈ కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో నిందితులను ఇంతవరకూ తేల్చలేదు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, తదితరులు గతంలో పిటిషన్లు వేశారు.