కుప్పకూలిన పాకిస్థాన్ యుద్ధ విమానం.. వింగ్ కమాండర్ దుర్మరణం

Pak Air Force Plane Crashes In Islamabad
  • ఇస్లామాబాద్ సమీపంలో కూలిపోయిన ఎఫ్-16 యుద్ధ విమానం
  • రిపబ్లిక్ డే కోసం రిహార్సల్స్ నిర్వహిస్తుండగా ప్రమాదం
  • పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు
పాకిస్థాన్ కు చెందిన ఓ యుద్ధ విమానం ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలో కుప్పకూలింది. రిహార్సల్స్ నిర్వహిస్తుండగా ఎఫ్-16 ఫైటర్ జెట్ కూలిపోయింది. ఈ నెల 23న పాకిస్థాన్ గణతంత్ర దినోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రిహార్సల్స్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ నౌమాన్ అక్రం ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడకు తరలి వెళ్లాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా పొగ వ్యాపించింది. విమానం కుప్పకూలిన ప్రాంతంలో ప్రదర్శనశాలలు, గోల్ఫ్ క్లబ్ లు, జిన్నా స్టేడియం ఉన్నాయి.
Go Back to Shorts
Pakistan
Fighter Get
Crash
Islamabad

More Telugu News