అల్లు శిరీష్ మూవీకి దర్శకుడిని ఖరారు చేసిన అల్లు అరవింద్

యువ కథానాయకులందరూ రేస్ లో తమ సత్తా చాటుకోవడానికి పోటీ పడుతున్నారు. అల్లు శిరీష్ మాత్రం తాపీగా ఒక్కో సినిమాను చేస్తూ వస్తున్నాడు. పైగా సినిమా .. సినిమాకి మధ్య ఆయన ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ .. అల్లు శిరీష్ కోసం ఒక కథను సెట్ చేశారు. తమిళంలో సూపర్ హిట్ కొట్టిన ఒక సినిమాకి ఇది రీమేక్.

కథాకథనాల పరంగా .. కథానాయకుడి బాడీ లాంగ్వేజ్ పరంగా .. బడ్జెట్ పరంగా ఆ కథను రీమేక్ చేయడానికి అల్లు అరవింద్ రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి రాకేశ్ శశి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. గతంలో ఆయన తెరకెక్కించిన 'జత కలిసే'..'విజేత' సినిమాలు అంతగా ఆడలేదు. అయినా రాకేశ్ శశిపై గల నమ్మకంతో ఈ ప్రాజెక్టును ఆయనకి అప్పగించినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

Allu Sirish
Allu Aravind
Rakesh Shashi Movie

More Telugu News