Chandrababu: డీజీపీ గౌతమ్ సవాంగ్ కు చంద్రబాబు లేఖ

TDP chief Chandrababu writes a letter to DGP Gautam Sawang
  • నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేయాలని కోరిన చంద్రబాబు
  • టీడీపీ నేతలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపణ
  • పోలీసులు చోద్యం చూస్తున్నారని వెల్లడి
  • తమ ఫిర్యాదులు స్వీకరించాలని డిమాండ్
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. కొందరు పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ అభ్యర్థులను వైసీపీ నేతలు అడ్డుకుంటుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని వివరించారు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే స్వీకరించకుండా వివక్ష చూపిస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతల ఫిర్యాదులను పోలీసులు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Chandrababu
DGP
Gautam Sawang
Letter
Andhra Pradesh
Telugudesam
Local Body Polls
YSRCP
Police

More Telugu News