జగన్ రాజద్రోహానికి పాల్పడ్డాడు: సీపీఐ నారాయణ

  • రిలయన్స్ వాళ్లకు రాజ్యసభ టికెట్ ఎలా ఇస్తారన్న నారాయణ
  • వైఎస్ మరణానికి రిలయన్సే కారణమని గతంలో ఆరోపించారని వెల్లడి
  • తండ్రికి జగన్ ద్రోహం చేశారని వ్యాఖ్యలు
రాజ్యసభ సభ్యుల విషయంలో సీఎం జగన్ రాజద్రోహానికి పాల్పడ్డాడంటూ సీపీఐ అగ్రనేత నారాయణ వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్ మరణానికి రిలయన్సే కారణమని జగన్ ఆరోపించాడని, ఇప్పుడు రిలయన్స్ కు చెందిన వాళ్లకు రాజ్యసభ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇది జగన్ తన తండ్రికి చేసిన ద్రోహమేనని నారాయణ అభిప్రాయపడ్డారు. అటు కేసీఆర్ కుయుక్తులు పన్ని ఎన్నికల్లో గెలుస్తున్నాడని, ఇటు జగన్ ప్రత్యర్థులు పోటీచేయకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. ఏపీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు.

CPI Narayana
Jagan
Reliance
Rajya Sabha
YSR

More Telugu News