కాబోయే భార్యతో హార్దిక్ పాండ్యా హోలీ వేడుక
- తన ఇంట్లో హోలీ సంబరాలు చేసుకున్న హార్దిక్
- అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన పాండ్యా బ్రదర్స్
- దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వబోతున్న హార్దిక్
గాయం కారణంగా ఐదు నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉన్నహార్దిక్ దక్షిణాఫ్రికాతో ఈనెల 12న మొదలయ్యే వన్డే సిరీస్‌తో పునరాగమనం చేయబోతున్నాడు. వెన్నుగాయానికి లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకొని ఈ మధ్యే మళ్లీ కాంపిటీటివ్ క్రికెట్‌లో అడుగు పెట్టాడు. ముంబైలో డీవై పాటిల్ కప్‌లో రిలయన్స్ వన్ టీమ్ తరఫున బరిలోకి దిగిన హార్దిక్ రెండు మెరుపు శతకాలతో ఫామ్‌లోకి వచ్చాడు.