నా స్వయంవరంలో ఈ ముగ్గురు ఉండాలని కోరుకుంటా: తమన్నా
- మీ స్వయంవరంలో ఏ హీరోలు ఉండాలని అడిగిన మీడియా ప్రతినిధి
- ప్రభాస్, విక్కీ కౌశల్, హృతిక్ రోషన్ ఉండాలన్న తమన్నా
- హృతిక్ తో ముద్దు సీన్లకైనా రెడీ అంటూ సరదా వ్యాఖ్యలు
ఈ ముగ్గురూ తన అభిమాన హీరోలని స్పష్టం చేసింది. వీరిలో హృతిక్ రోషన్ తో తాను ముద్దు సీన్లలో నటించేందుకైనా సిద్ధమేనని తన అభిమానం ప్రదర్శించింది. సాధారణంగా తాను సినిమాల్లో కిస్సింగ్ సీన్లకు దూరంగా ఉంటానని, ఆ మేరకు ముందే ఒప్పందం కుదుర్చుకుంటానని, హృతిక్ తో చేయాల్సి వస్తే ఆ ఒప్పందాన్ని పక్కనపెట్టేస్తానని సరదాగా వ్యాఖ్యానించింది. బాహుబలి తర్వాత తమన్నా పెళ్లి చేసుకుంటుందని అనేక కథనాలు వచ్చాయి. ఆమె తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారని ప్రచారం జరిగినా ఆ వార్తలను తమన్నా అంగీకరించలేదు.