రఘుబాబు మంచి కమెడియన్ అవుతాడని నేను ముందే చెప్పాను: నటి తులసి

  • పదేళ్లు నటనకి దూరమయ్యాను 
  • 378 సినిమాల వరకూ చేశాను 
  • మా ఇంటికి దగ్గర్లోనే రఘుబాబు వాళ్లు వుండేవారన్న తులసి  
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తులసి మాట్లాడుతూ .. "1967లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. పెళ్లికి ముందు 5 సంవత్సరాల పాటు అవకాశాలు రాలేదు. పెళ్లి తరువాత 5 సంవత్సరాల పాటు సినిమాలు చేయలేదు. అలా 10 సంవత్సరాల పాటు గ్యాప్ వచ్చినప్పటికీ, ఇంతవరకూ 378 సినిమాలు చేశాను.

గిరిబాబుగారి ఫ్యామిలీతో మాకు మంచి సాన్నిహిత్యం వుంది. వాళ్లింటికి చాలా దగ్గరలోనే మా ఇల్లు ఉండేది. అందువలన నేను రఘుబాబును చాలా దగ్గరగా చూశాను. ఆయన బాడీ లాంగ్వేజ్ .. మాట్లాడే తీరు ప్రత్యేకంగా ఉండేవి. అందువలన 'నువ్ మంచి ఆర్టిస్ట్ అవుతావు రఘు' అనే దానిని. నేను అన్నట్టుగానే ఆయన సినిమాల్లోకి వచ్చాడు .. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత మేము ఇద్దరం కలిసి కూడా నటించాము" అని చెప్పుకొచ్చారు.

Thulasi
Ali
RaghuBabu

More Telugu News