Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జబర్దస్త్‌' నటుడు దొరబాబు వ్యభిచార గృహంలో పట్టుబడడంపై ఆయన భార్య అమూల్య స్పందన

dorababu wife on police raid
  • మనిషిని అపార్థం చేసుకునే ముందు కొన్ని విషయాలు ఆలోచించాలి
  • అతడు గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకోవాలి
  • నిజానిజాలు అర్థమవుతాయి
విశాఖపట్నంలో పోలీసులు చేసిన తనిఖీల్లో వ్యభిచార గృహంలో జబర్దస్త్‌ నటులు దొరబాబు, పరదేశీలు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దొరబాబు భార్య అమూల్య ఓ పోస్ట్‌ చేసి, సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలను తిప్పికొట్టారు.

మనిషిని అపార్థం చేసుకునే ముందు అతడు గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయని అమూల్య పేర్కొంది. ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయని చెప్పుకొచ్చింది. అందుకే ఎవరూ గతాన్ని మర్చిపోవద్దని చెప్పుకొచ్చింది. దొరబాబు, అమూల్యలది ప్రేమ పెళ్లి. ఆమె సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. టిక్‌టాక్ వీడియోలు తీసుకుని పోస్ట్ చేస్తుంటుంది.
Jabardasth
Vizag

More Telugu News