Corona Virus: ప్రపంచ వ్యాప్తంగా 4,000 దాటిన 'కరోనా' మృతుల సంఖ్య.. 100కు పైగా దేశాల్లో వ్యాప్తి

Global virus toll tops with  more deaths in China
షార్ట్స్‌లో చూడండి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 4,000ను దాటింది. చైనాలో మరో 17 మంది మృతి చెందడంతో ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 4,012కు చేరింది. కరోనా వైరస్‌ ఇప్పటివరకు ప్రపంచంలోని 100కు పైగా దేశాల్లో  వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా 1,10,000 కరోనా కేసులు నమోదయ్యాయి.

పలు దేశాల్లో విదేశీయుల ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. అలాగే, షెడ్యూలు ప్రకారం జరగాల్సిన ఎన్నో కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. చైనాలో కరోనా కేసులు కాస్త తగ్గుతున్నప్పటికీ, ఇతర దేశాల్లో ఈ కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 3,136 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో కరోనా సోకిన వారి సంఖ్య 80,750గా ఉంది.
Go Back to Shorts
Corona Virus
China

More Telugu News