మోహన్ బాబు రాత్రిపూట రైస్ తిని 40 ఏళ్లుపైనే అయింది: రాజా రవీంద్ర
- మోహన్ బాబు డేట్స్ కూడా తానే చూస్తానని వెల్లడించిన రవీంద్ర
- క్రమశిక్షణకు మారుపేరు అంటూ కితాబు
- దగ్గర్నుంచి చూస్తే మోహన్ బాబు అర్థమవుతారని వ్యాఖ్యలు
క్రమశిక్షణకు మారుపేరుగా మోహన్ బాబును అభివర్ణిస్తుంటారని, అందులో ఎలాంటి సందేహం లేదని రాజా రవీంద్ర చెప్పారు. ఉదయాన్నే 5 గంటలకు వాకింగ్ చేస్తారని, ఎంతో ఆరోగ్యవంతమైన జీవనశైలిని అవలంబిస్తారని తెలిపారు. తినే తిండి విషయంలో ఎంతో కచ్చితంగా ఉంటారని, ఆయన రాత్రి పూట రైస్ తిని దాదాపు 40 ఏళ్లు పైనే అయిందని వెల్లడించారు.