Chandrababu: మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

Chandrababu severe comments on Minister Peddy Reddy
  • పుంగనూరులో వైసీపీ బెదిరింపులకు పాల్పడుతోంది
  • టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వరా?
  • ‘పంచాయతీరాజ్ శాఖ మంత్రికి సిగ్గుందా?’
ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ బెదిరింపులకు సంబంధించిన ఓ వీడియోను ప్లే చేసి చూపించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పుంగనూరులో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వారిని బెదిరిస్తున్నారని, వైసీపీ నేతల అరాచకాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పంచాయతీరాజ్ శాఖ మంత్రికి సిగ్గుందా?’ అంటూ ధ్వజమెత్తిన చంద్రబాబు, ఆ పదవిలో ఉండటానికి పెద్దిరెడ్డి అనర్హుడని, ఆయన్ని వెంటనే అరెస్టు చేయాలని, పుంగనూరు ఘటనకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపు నిచ్చారు. వైసీపీ నేతలు మామూలు మనుషులుగా ప్రవర్తించాలంటే ఈ ఎన్నికల్లో తగినబుద్ధి చెప్పాలని, అప్పుడే కంట్రోల్ అవుతారని, లేకపోతే, ఇంకా రెచ్చిపోయి ఈ రాష్ట్రాని ఇంకా అతలాకుతలం చేస్తారని చెప్పారు. రాజధాని ప్రాంత ప్రజానీకం ఇన్ని రోజులుగా నిరసనలు తెలుపుతుంటే, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని అన్నారు.
Chandrababu
Telugudesam
Peddireddi Ramachandra Reddy
YSRCP
minister

More Telugu News