Local Body Polls: ‘స్థానిక’ ఎన్నికల ఎఫెక్ట్​.. ఏపీలో మద్యం సరఫరా నిలిపివేతకు నిర్ణయం

In the wake of AP Local body polls a key decesion has taken by Government
  • ఈ నెల 12 నుంచి 29 వరకు మద్యం సరఫరా నిలిపివేత
  • ఓటర్లపై మద్యం, డబ్బు ప్రభావం ఉండకూడదనే ఈ నిర్ణయం
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమన్న మంత్రి అనిల్
ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిపివేస్తున్నట్టు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఓటర్లపై మద్యం, డబ్బు ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంచేందుకు వీల్లేదని సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
Local Body Polls
Andhra Pradesh
Alchohol

More Telugu News