బ్రెయిన్ డెడ్, కార్డియాక్ అరెస్ట్... మారుతీరావు పోస్టుమార్టం ప్రిలిమినరీ రిపోర్ట్!
- శరీరంపై ఎటువంటి గాయాలూ గుర్తించలేదు
- మృతదేహం రంగు మారడానికి కారణం విషమే
- రక్త ప్రసారం ఆగి చనిపోయాడన్న వైద్యులు
బ్రెయిన్ డెడ్, గుండెపోటు కారణంగా ఆయన మరణించారని, విషం తీసుకోవడమే ఇందుకు కారణమని వైద్యుల బృందం తమ రిపోర్టులో పేర్కొంది. మారుతీరావు మృతదేహం రంగు మారడానికి కూడా ఈ విష ప్రభావమే కారణమని వెల్లడించింది. విషం తీసుకున్న తరువాత ఆయన శరీరంలో రక్త ప్రసారానికి అవాంతరాలు ఏర్పడ్డాయని, ఫలితంగా రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోనే ప్రాణాలు పోయి ఉంటాయని తమ పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.