కాంగ్రెస్ సీనియర్ నేత హన్స్‌రాజ్ భరద్వాజ్ కన్నుమూత

  • కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన హన్స్‌రాజ్
  • వారం రోజులుగా ఆసుపత్రిలోనే
  • నేటి సాయంత్రం నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో అంత్యక్రియలు
కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హన్స్‌రాజ్ భరద్వాజ్ (83) నిన్న సాయంత్రం ఢిల్లీలో గుండెపోటుతో కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గత బుధవారం సాకేత్‌లో మాక్స్ ఆసుపత్రిలో చేరారు. నేటి సాయంత్రం నాలుగు గంటలకు నిగమ్‌బోధ్ ఘాట్‌లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుమారుడు అరుణ్ భరద్వాజ్ తెలిపారు. హన్స్‌రాజ్‌కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హన్స్‌రాజ్ మరణవార్తతో కాంగ్రెస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. గతంలో ఆయన కర్ణాటకకు గవర్నర్ గా కూడా పనిచేశారు.

Congress
Hans Raj Bhardwaj
Passes away

More Telugu News