మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుంది?: చంద్రబాబు

  • గజపతిరాజు కుటుంబీకుల మధ్య చిచ్చురేపిన మాన్సాస్ ట్రస్టు వ్యవహారం
  • ఇది ట్రస్టు ఆస్తులను కొట్టేసే ప్రయత్నమని ఆరోపించిన చంద్రబాబు
  • అశోక్ గజపతిరాజు వంటి వ్యక్తిని ఇబ్బందిపెడతారా? అంటూ ఆగ్రహం
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాన్సాస్ ట్రస్టు వివాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును ట్రస్టు చైర్మన్ పదవి నుంచి తొలగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వంశపారంపర్య ఆస్తులు, ట్రస్టుల వ్యవహారాల్లో ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. అశోక్ గజపతిరాజు వంటి వ్యక్తిని ఇబ్బందిపెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మాన్సాస్ ట్రస్టు ఆస్తులను కొట్టేసే ప్రయత్నమని చంద్రబాబు ఆరోపించారు. ధర్మకర్తల మండలిలో అన్యమతస్తులను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.

Chandrababu
Mansas Trust
Ashok Gajapathi Raju
Sanchaita
Andhra Pradesh

More Telugu News