మాస్ మహారాజాతో ఇస్మార్ట్ హీరోయిన్

  • రాక్షసుడు ఫేం రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమా
  • ఇందులో ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ కు చాన్స్
  • ప్రస్తుతం ‘క్రాక్’ చిత్రంలో నటిస్తోన్న రవితేజ
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో అడుగుపెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉన్న నిధి అగర్వాల్ మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. పూరీ జగన్నాథ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఆకట్టుకున్న నిధి.. మాస్ మహారాజా రవితేజ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ‘రాక్షసుడు’ ఫేం రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త చిత్రంలో ఓ హీరోయిన్ గా నిధిని ఎంచుకున్నారు. ఇందులో మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉంది. మరో నాయికతో పాటు ఇతర తారాగణం వివరాలను  చిత్ర బృందం త్వరలో ప్రకటించనుంది. ఏ స్టూడియోస్ బ్యానర్ లో హవీష్ ప్రొడక్షన్ లో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

 రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’చిత్రంలో నటిస్తున్నాడు.  గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోలీస్ పాత్రలో అభిమానుల ముందుకు రాబోతున్న రవితేజ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

raviteja
nidhi agarwal

More Telugu News