Gujarath: గుజరాత్ కు ఉగ్రదాడుల హెచ్చరికలు

  • ప్రముఖుల లక్ష్యంగా జరగొచ్చన్న ఐబీ 
  • హిట్ లిస్ట్ లో అమిత్ షా, విజయరూపాని తదితరుల పేర్లు 
  • ముఖ్యమైన నగర పర్యటనల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన

గుజరాత్ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ప్రముఖులు లక్ష్యంగా ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కేంద్రాన్ని హెచ్చరించింది. అహ్మదాబాద్, సూరత్, వడోదరా, రాజ్ కోట్ నగరాల్లో దాడులకు అవకాశం ఉందని ఇటీవల సమర్పించిన నివేదికలో పేర్కొంది. 

ముఖ్యంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర హోం మంత్రి హరేనాపాండ్యా సహా పలువురు ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపేందుకు ఉగ్రమూకలు పాగా వేసి ఉన్నాయని, ఆయా నగరాల్లోని పోలీసు బలగాలు సదా అప్రమత్తంగా ఉండాలని తమ నివేదికలో పేర్కొంది.

Gujarath
IB warning
terrorist attacks
Amit Shah

More Telugu News