Disha: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దిశ నిందితుడు చెన్నకేశవులు భార్య

chennakeshavulu wife blessed with baby girl
  • నెలలు నిండడంతో మొన్న ఆసుపత్రిలో చేరిన చెన్న కేశవులు భార్య
  • నిన్న ఆడపిల్ల పుట్టిందని తెలిపిన వైద్యులు
  • తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని ప్రకటన
దేశంలో సంచలనం సృష్టించిన 'దిశ' హత్యాచారం కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య నిన్న బిడ్డకు జన్మనిచ్చింది. నెలలు నిండడంతో ఆమెను మొన్న మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, సాధారణ ప్రసవానికి అవకాశం లేకపోవడంతో ఆమెకు నిన్న సిజేరియన్‌ చేశారు.

ఆమెకు పండంటి ఆడపిల్ల పుట్టిందని  తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆమెది మహబూబ్‌ నగర్ జిల్లా, మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామం. కాగా, హైదరాబాద్‌ పోలీసుల చేతిలో చెన్నకేశవులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతడి భార్య గర్భవతి. ఆమె చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది.
Disha
Mahabubabad District

More Telugu News