క్రేన్ ప్రమాద ఘటనలో పోలీసు విచారణకు హీరోయిన్ కాజల్ ?

Tamilnadu Police to Interrogate Kajal Agarwal On About Crane Accident
  • ఇండియన్-2 ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు
  • ఇప్పటికే  విచారణకు హాజరైన కమలహాసన్, శంకర్ 
  • కాజల్ కు సమన్లు జారీ చేయనున్న పోలీసులు 
ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ పోలీసుల విచారణకు హాజరుకానున్నట్టు సమాచారం. ఇండియన్-2 చిత్రం సెట్ లో జరిగిన ప్రమాదానికి సంబంధించి తమిళనాడు క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెను విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం పోలీసులు కాజల్ కు సమన్లు జారీ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. కమలహాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2 సినిమా తెరకెక్కుతోంది. దీన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది.

అయితే, చెన్నైలో గత నెల 19న సినిమా షూటింగ్ చేస్తుండగా ఓ క్రేన్ కుప్పకూలిన ప్రమాదంలో ముగ్గురు యూనిట్ సభ్యులు మరణించారు. ఆ సమయంలో అక్కడే  ఉన్న కమల్, కాజల్ తో పాటు దర్శకుడు శంకర్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా ఇప్పటికే కమల్, శంకర్, ప్రమాదం జరిగినప్పుడు లొకేషన్ లో ఉన్న ఇతర యూనిట్ సభ్యులను విచారించారు. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ ను కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సమన్లు అందుకున్న వెంటనే కాజల్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
Go Back to Shorts
Kajal Agarwal
Police
Crane Accident

More Telugu News