కరణ్ జోహర్ మనసు దోచేసిన విజయ్ దేవరకొండ
- పూరి సినిమా షూటింగులో విజయ్ దేవరకొండ
- నేరుగా హిందీ సినిమా చేయించే ఆలోచనలో కరణ్
- విజయ్ దేవరకొండతో జరిగిన చర్చలు
ఈ సినిమా షూటింగులో విజయ్ దేవరకొండ నటనను కరణ్ జోహర్ ప్రత్యక్షంగా చూశాడట. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ కరణ్ కి బాగా నచ్చేశాయట. అసలు కెమెరాను పట్టించుకోకుండా ఆయన చేసే సహజమైన నటనకి ఫిదా అయిన కరణ్ జోహర్, విజయ్ దేవరకొండతో హిందీలో సినిమాలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. హిందీలో సినిమాలు చేసి, సౌత్ లోని మిగతా భాషల్లోను విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడని అంటున్నారు. ఈ విషయాన్ని గురించి ఆయన విజయ్ దేవరకొండతో మాట్లాడటం కూడా జరిగిపోయిందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.