నీరవ్ మోదీకి మరోసారి నిరాశ.... బెయిల్ కు నో చెప్పిన న్యాయస్థానం
- ఐదోసారి మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
- గృహ నిర్బంధంలోనే ఉంటానని మోదీ చెప్పినా సమ్మతించని కోర్టు
- 4 మిలియన్ పౌండ్లకు ష్యూరిటీ సమర్పిస్తానన్న మోదీ
- దేశం విడిచి వెళ్లిపోతాడన్న అనుమానంతో బెయిల్ కు కోర్టు ససేమిరా
తప్పనిసరిగా గృహ నిర్బంధంలోనే ఉంటానని, 24 గంటల పోలీసు పర్యవేక్షణకు సమ్మతమేనని మోదీ ప్రతిపాదనలు చేసినా కోర్టు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. అంతేకాదు 4 మిలియన్ పౌండ్లకు బెయిల్ ష్యూరిటీ సమర్పిస్తానని పేర్కొన్నా న్యాయమూర్తి ఒప్పుకోలేదు. బెయిల్ ఇస్తే దేశం విడిచి పోతాడన్న అనుమానంతోనే లండన్ న్యాయస్థానం బెయిల్ నిరాకరించినట్టు అర్థమవుతోంది.