'గోపాల గోపాల' దర్శకుడితోను పవన్?
- 'పింక్' రీమేక్ షూటింగులో పవన్
- లైన్లో క్రిష్ .. హరీశ్ శంకర్
- కిషోర్ కుమార్ పార్థసాని కథకి ఓకే చెప్పిన పవన్
ఆ తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేయడానికి పవన్ కల్యాణ్ ఆమోదాన్ని తెలియజేశాడు. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను రూపొందించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తరువాత కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో పవన్ చేయనున్నాడనేది తాజా సమాచారం. గతంలో పవన్ తో ఆయన చేసిన 'గోపాల గోపాల' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆయన వినిపించిన కథకి కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.