'క్రాక్' సినిమా నుంచి వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్టులుక్
- పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ
- నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో వరలక్ష్మీశరత్ కుమార్
- సంగీత దర్శకుడిగా తమన్
వరలక్ష్మీ శరత్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వదిలిన ఈ పోస్టర్లో, ఆమె లుక్ చాలా కొత్తగా వుంది. ఆమె లుక్ చూస్తుంటే, గ్రామీణ నేపథ్యంలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రనే పోషిస్తున్నట్టుగా అనిపిస్తోంది. నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలకి వరలక్ష్మీ శరత్ కుమార్ కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. అందువలన ఈ సినిమాలోను ఆమె అదే తరహా పాత్రను చేస్తోందని అనుకోవచ్చు. రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మే 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.