'ఒరేయ్ బుజ్జిగా' నుంచి టీజర్ రిలీజ్
- విజయ్ కుమార్ కొండా నుంచి లవ్ స్టోరీ
- కీలకమైన పాత్రలో వాణీ విశ్వనాథ్
- మార్చి 25వ తేదీన విడుదల
ప్రధాన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. లవ్ .. కామెడీ .. యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది. రాజ్ తరుణ్ సరసన నాయికలుగా మాళవిక నాయర్ .. హెబ్బా పటేల్ అలరించనుండగా, ఒక కీలకమైన పాత్రలో వాణీ విశ్వనాథ్ కనిపిస్తోంది. మాళవిక నాయర్ ఈ సినిమాలో మరింత గ్లామరస్ గా అనిపిస్తోంది. ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతోనైనా రాజ్ తరుణ్ కి హిట్ పడుతుందేమో చూడాలి.