'పలాస 1978'లో విలన్ గా నా పాత్ర స్పెషల్ : రఘు కుంచె
- 'పలాస 1978'లో నటించాను
- ఐదుగు సింగర్స్ ను పరిచయం చేశాను
- ఈ నెల 6న విడుదలవుతుందన్న రఘు కుంచె
ఆ తరువాత నెగెటివ్ షేడ్స్ కలిగిన ఒక పాత్ర వుంది చేయమని కోరారు. ఆ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండటంతో నేను ఒప్పుకున్నాను. మైండ్ గేమ్ ఆడే నెగెటివ్ రోల్ లో నేను నటించాను. సినిమా మొత్తం కూడా నేను మేకప్ లేకుండా చాలా నేచురల్ గా కనిపిస్తాను. ఈ పాత్ర అందరికీ చాలా కొత్తగా కనిపిస్తుంది .. కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు వున్నాయి. ఐదు పాటలకు ఐదుగురు కొత్త సింగర్స్ ను పరిచయం చేయడం నాకు సంతృప్తిని కలిగించింది. నటుడిగా .. సంగీత దర్శకుడిగా ఈ సినిమా నాకు మంచి పేరు తెస్తుందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.