టీడీపీ నేత, కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం
- కర్నూలులోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం
- భార్య, కుమార్తె మార్కెట్ కు వెళ్లిన సమయంలో ఘటన
- రాజకీయంగా అందరూ మోసం చేశారనే ఆవేదనలో బంగి అనంతయ్య
భార్య, కుమార్తె కూరగాయల కోసం మార్కెట్ కు వెళ్లిన సమయంలో బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం చేశారు. విషయాన్ని గమనించిన స్థానికులు ఆయనను రక్షించారు. అనంతరం హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. బంగి అనంతయ్య ఆత్మాహత్యాయత్నం చేశారనే వార్తతో టీడీపీ శ్రేణులు షాక్ కు గురయ్యాయి. రాజకీయంగా తనను అందరూ మోసం చేశారనే ఆవేదనతోనే ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలుస్తోంది.