Jabardasth: 'జబర్దస్త్' నటుడు శాంతి స్వరూప్‌కు చేదు అనుభవం

  • శాంతి స్వరూప్ దగ్గరికి వచ్చి నడుముపై చేయి వేసిన యువకుడు
  • అంతటితో ఆగకుండా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం
  • వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం  
  • బూతులు తిట్టిన శాంతి స్వరూప్ 
Jabardasth comedian Shanti Swaroop faces bitter experience

జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్ వేసే శాంతి స్వరూప్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రాంక్ వీడియో తీద్దామని ప్రయత్నించిన ఓ యువకుడు.. శాంతి స్వరూప్ దగ్గరికి వచ్చి నడుముపై చేయి వేశాడు. అంతటితో ఆగకుండా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడంతో శాంతి స్వరూప్ భగ్గుమన్నాడు.

ఆ యువకుడిని కొట్టడానికి చెప్పు కూడా తీశాడు. దీంతో ఆ యువకుడు తాము ప్రాంక్ వీడియో తీస్తున్నామని చెప్పాడు. అయినప్పటికీ శాంతి స్వరూప్‌ కస్సుమన్నాడు. వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో శాంతి స్వరూప్ బూతులు తిట్టాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఓ సినిమా షూటింగ్‌లో శాంతి స్వరూప్‌ పాల్గొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలోనూ శాంతి స్వరూప్‌ పలు సార్లు చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు. తనకు ఇటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయని పలు ఇంటర్వ్యూల్లోనూ చెప్పాడు.

More Telugu News