ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అరెస్టు
- తనపై దుర్భాషలాడారని సరబుజ్జిలి ఈవోపీఆర్డీ ఫిర్యాదు
- ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
- కేసు వివరాలు అడిగేందుకు పీఎస్ కు వెళ్లిన కూన అరెస్టు
కాగా, ఆముదాలవలసలో టీడీపీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రాంతం వద్దకు వెళ్లిన పోలీసులు కూన రవికుమార్ కు ఈ విషయం తెలిపారు. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో చెప్పాలని పోలీసులను రవికుమార్ అడిగినట్టు సమాచారం. కేసు వివరాలు తెలుసుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రవికుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు.