శ్రీరెడ్డితో డేటింగ్ కు వెళ్లడంపై రామ్ గోపాల్ వర్మ కామెంట్!
- డేటింగ్ అంటే ఒకరితో కలిసి బయటకు వెళ్లడం
- నేను ఎప్పుడూ ఒక అమ్మాయితో కలిసి బయటకు వెళ్లను
- నా ఉద్దేశంలో పెళ్లి, అంత్యక్రియలు రెండూ ఒకటే
పెళ్లి విషయంపై ప్రశ్నించగా... ఈ మధ్యన తనను ఒకరు పెళ్లికి ఆహ్వానించారని... పెళ్లికి, అంత్యక్రియలకు తాను రానని చెప్పానని, ఇదే తన రూల్ అని వర్మ తెలిపారు. తన ఉద్దేశంలో ఈ రెండు ఒకటేనని... ఇక్కడ మనసు చచ్చిపోతుందని, అక్కడ మనిషి చచ్చిపోతాడని అన్నారు. ఒక్క శాతం తెలివి ఉన్నా పెళ్లి చేసుకోకూడదని... అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని... తన మాట వినకపోతే ఆ తర్వాత మీ ఖర్మ అని చెప్పారు.