విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, ఉరి.. ఏడుగురు విద్యార్థుల అరెస్ట్!
- పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు
- పరీక్ష అయిపోయిన తర్వాత పార్టీ పేరుతో తీసుకెళ్లి అత్యాచారం
- అనంతరం సమీపంలోని అడవిలో చెట్టుకు ఉరి వేసిన వైనం
అసోంలోని బిశ్వనాథ్ జిల్లా పోలీసులు ఈ కేసుకు సంబంధించి వెల్లడించిన వివరాల ప్రకారం... గోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్లా గ్రామంలో శుక్రవారం నాడు ఈ ఘటన సంభవించింది. పరీక్ష రాసిన అనంతరం... పార్టీ చేసుకుందామని సదరు బాలికను ఇతర విద్యార్థులు పిలిచారు. ఆ తర్వాత ఆమెను ఓ ఇంటికి తీసుకెళ్లారు. ఆ ఇంట్లోనే శుక్రవారం రాత్రి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత సమీపంలోని అడవిలో ఓ చెట్టుకు ఉరి వేశారు. శనివారం నాడు బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ దారుణానికి పాల్పడ్డ ఏడుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.