రాయచోటి డైట్ కేంద్రంలో తెలుగు లెక్చరర్ కీచకావతారం
కడప జిల్లాలోని రాయచోటి డైట్ విద్యాకేంద్రంలో ఓ తెలుగు అధ్యాపకుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన వెలుగు చూసింది. గిరిబాబు యాదవ్ అనే లెక్చరర్ అదనపు మార్కులు వేస్తానంటూ ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు తెలిసింది. లెక్చరర్ గిరిబాబుపై ఆ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.