భారత బౌలర్లు ఫెయిల్.. తొలి రోజు న్యూజిలాండ్‌దే!
- భారత్ 242 ఆలౌట్
- పృథ్వీ, పుజారా, విహారి హాఫ్ సెంచరీలు
- జెమీసన్‌ను ఐదు వికెట్లు
- న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 63/0
- ముగిసిన తొలి రోజు ఆట
యువ ఓపెనర్ పృథ్వీ షా (54), చతేశ్వర్ పుజారా (54), హనుమ విహారి (55) అర్ధ శతకాలతో రాణించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (3), మయాంక్ అగర్వాల్ (7), అజింక్యా రహానే (7), రిషభ్ పంత్ (12), రవీంద్ర జడేజా (9) నిరాశ పరిచారు. కివీస్ బౌలర్లలో కైల్ జెమీసన్ (5/45) ఐదు వికెట్లతో భారత్‌ను దెబ్బకొట్టాడు. టిమ్ సౌథీ (2/38), ట్రెంట్ బౌల్ట్ (2/89) చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ మొదటి రోజు ఆట చివరకు తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (27 బ్యాటింగ్), టామ్ బ్లండెల్ (29 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 23 ఓవర్లు బౌలింగ్ చేసిన భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.