హార్దిక్ పటేల్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం
- పటీదార్ ర్యాలీ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు
- మార్చి 6వ తేదీ వరకూ పటేల్ ను అరెస్ట్ చేయకూడదని ఆదేశం
- 2015లో జరిగిన ర్యాలీలో హింస చెలరేగడంతో హార్దిక్‌పై కేసు
కేసు తదుపరి విచారణ జరిగే మార్చి 6వ తేదీ వరకు పటేల్ ను అరెస్టు చేయకూడదని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పటేల్ తొలుత గుజరాత్ హైకోర్టును కోరారు. కానీ, ఆయన పిటిషన్‌ను ఆ కోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హార్దిక్ నేతృత్వంలోని పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి 2015లో అహ్మాదబాద్ లో నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తంగా మారడంతో హింస చెలరేగింది. దాంతో, హార్దిక్‌పై కేసు నమోదైంది.