Chandrababu: విశాఖ విమానాశ్రయం వద్ద చంద్రబాబు కాన్వాయిని చుట్టిముట్టిన వైసీపీ కార్యకర్తలు.. ఎమ్మెల్యే వాహనం ధ్వంసం

chandrababu reached at viza airport
  • విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు
  • టీడీపీ, వైసీపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు
  • ఇరు పార్టీల కార్యకర్తల తీరుతో ఉద్రిక్తత 
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. ఇరు పార్టీల కార్యకర్తల నినాదాలతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.

రోడ్లపై వైసీపీ కార్యకర్తల బైఠాయింపు వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఎదురవుతోంది. విశాఖ విమానాశ్రయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు కారును కొందరు ధ్వంసం చేయడం కలకలం రేపింది. చంద్రబాబు కాన్వాయిని చుట్టుముట్టిన వైసీపీ కార్యకర్తలు దాన్ని ముందుకు కదలనివ్వట్లేదు. విశాఖ ఎన్‌ఏడీ కూడలి వద్ద టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News