ఢిల్లీ హైకోర్టు జడ్జి ఆకస్మిక బదిలీపై ప్రియాంకాగాంధీ స్పందన
- జడ్జిపై కేంద్రం అధికార బలాన్ని చూపించింది
- న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టింది
- ఇదొక సిగ్గుపడాల్సిన విషయం
ఢిల్లీ హింసకు సంబంధించిన పిటిషన్ ను నిన్న రాత్రి జస్టిస్ మురళీధర్ తన ఇంటివద్దే విచారించారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ముగ్గురు బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే జస్టిస్ మురళీధర్ పై బదిలీ వేటు పడింది.