ఢిల్లీలో అల్లర్లు జరుగుతుంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నట్టు?: కేంద్రాన్ని ప్రశ్నించిన రజనీకాంత్
- సీఏఏ వ్యతిరేక అల్లర్లలో హింసపై రజనీ స్పందన
- 27 మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆగ్రహం
- ఇది కచ్చితంగా కేంద్ర హోంశాఖ వైఫల్యమేనని వ్యాఖ్యలు
గతంలో సీఏఏపై రజనీ వ్యాఖ్యానిస్తూ, ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదన్నారు. ఒకవేళ ముస్లింలకు దీని వల్ల ఏదైనా నష్టం జరుగుతుందని భావిస్తే గొంతు విప్పే వాళ్లలో తానే మొదటివాడ్నవుతానని తెలిపారు. అన్నట్టుగానే తన మాట నిలబెట్టుకున్నారు. సీఏఏ కారణంగా ప్రభావితులవుతున్న ప్రతి ఒక్కరికి మద్దతుగా నిలుస్తాను అంటూ తాజా వ్యాఖ్యలు చేశారు.